అంబా! శాంభవి! భద్రరాజ గమనా!
కాళీ హైమవతీశ్వరీ త్రినయనా!
అమ్మలగన్న అమ్మవే
ఈ అమ్మ మనసునే ఎరుగవా
ఒక అమ్మగా నువు కరుగవా
ఆ శాపమే ఇక బాపవా ||
ఏనాడైనా ఏ వరమైనా కలలోనైనా అర్థించానా
విధి నెదిరించే శక్తియె లేక ఈ విధి నిన్నే వేడితినమ్మా
కష్టాలన్ని కడతేర్చవా
కన్నీళ్లన్ని తొలగించవా
కారుణ్యమ్ము చూపించవా -
ఈ ఘోరమ్ము తప్పించవా -
ఒక అమ్మగా నువు కరుగవా ||
తరతరాలుగ నిన్ను తల్లివని కొలిచాను
మమ్మింక మన్నించవే
సుతుని శాపము మార్చి నా రూపు గ్రహియించి
ఆదుకొన అరుదెంచవే
సత్యమ్ముగా నీది మాతృ హృదయమ్మైతే
సత్వరమ్మే సాగిరా
ఉరుములా మెరుపులా ఉప్పొంగు కడలిలా
శీఘ్రమ్ముగా కదలిరా
ఓంకార బీజాక్షరీ త్రైలోక్య రక్షాకరీ
శ్రీ చక్ర సంచారిణీ రుద్రాణి నారాయణీ
పాహిమాం పరమేశ్వరీ రక్షమాం రాజేశ్వరీ
పాహిమాం పాహిమాం పాహిమాం పాహిమాం

No comments:
Post a Comment